ఘనంగా వేమన విగ్రహావిష్కరణ
ABN, First Publish Date - 2022-01-20T05:35:18+05:30
యోగివేమన జయంతి సందర్భంగా పలమనేరులో బుధవారం వైవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వేమన విగ్రహావిష్కరణ, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
పలమనేరు, జనవరి19 : యోగివేమన జయంతి సందర్భంగా పలమనేరులో బుధవారం వైవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వేమన విగ్రహావిష్కరణ, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ సమీపంలో 24 అడుగుల ఎత్తుగల వేమన విగ్రహాన్ని ధార్మిక కవిరత్న బత్తిన మునిరత్నం రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహ దాత సీవీ కుమార్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. విగ్రహం దిమ్మె చుట్టూ వేమన రాసిన 100 పద్యాలను చెక్కించారు. అనంతరం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. వద్ధ్దాశ్రమంలో, రిమ్మర్స్ ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలలో భోజన వసతి కల్పించారు. నిరుపేదలకు బెడ్‌షీట్లు, అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. తండ్రిని కోల్పోయి చదువును అర్ధంతరంగా ఆపివేస్తున్న స్నేహ అనే విద్యార్థినికి చదువు కొనసాగించేందుకు రూ. 30వేలు చెక్కును అందజేశారు. శతకపద్యాల ధారణ చేసిన జననిప్రియకు ట్రస్టు తరపున రూ. 5వేలు చెక్కును అందజేశారు. వికలాంగులకు 5 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. పెద్దపంజాణి ప్రభుత్వాస్పత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను దాత మోహన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమాల్లో ట్రస్టు అధ్యక్షుడు చెంగారెడ్డి, అమరనాథరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర రెడ్డి, రమేష్ రెడ్డి, హేమంత్‌కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, నాగరాజరెడ్డి, ద్వారకనాథరెడ్డి, సుబ్బారెడ్డి, బాబురెడ్డి, బాలాజిరెడ్డి, కొండారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, విక్రమాదిత్యరెడ్డి, భాస్కర్‌రెడ్డి, దయానందగౌడు, వినోద్‌కుమార్‌రెడ్డి, జయకుమార్‌రెడ్డి, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T05:35:18+05:30 IST