ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నత్తనడకన శ్రీకాళహస్తి ఆస్పత్రి విస్తరణ పనులు

ABN, First Publish Date - 2022-12-03T01:19:22+05:30

శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు మందకొడిగా సాగుతుండడంతో రోగులకు అవస్థలు తప్పడంలేదు.ఎక్కడ చూసినా అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. సురక్షితంగా గర్భవతులకు వైద్యం అందించాల్సిన సిబ్బంది విధిలేక వరండాలోనే పడకలు కేటాయించడం ఇక్కడి పరిస్థితులకు అద్దంపడుతోంది.

నిర్మాణదశలో ఉన్న ఆస్పత్రి భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి,డిసెంబరు 2:శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని 1999లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు.పట్టణంలోని అయ్యలనాడు చెరువులో వంద పడకల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. తూర్పు మండలాలతో పాటు ఇటీవల తిరుపతి జిల్లాలో భాగమైన వెంకటగిరి, బాలాయపల్లి, నాయుడుపేట, పెళ్లకూరు, సూళ్లూరుపేట ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితం ఓపీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. అదే స్థాయిలో శస్త్రచికిత్సలు, కాన్పులు కూడా పెరిగాయి.దీంతో ఆస్పత్రిని 200 పడకలకు విస్తరించాలని అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.చివరకు మూడేళ్ల క్రితం 150 పడకలకు విస్తరించడానికి నాడు నేడు పథకం కింద ఎంపిక చేశారు. నాబార్డు కింద రూ.12కోట్లతో పనులను కాంట్రాక్టు సంస్థ 2020అక్టోబరు 26వ తేదీన ప్రారంభించింది. మొత్తం 4,049.53 చదరపు మీటర్ల పనులను రెండేళ్ల లోగా అంటే ఈ ఏడాది అక్టోబరు 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు.ఐదు నెలల క్రితం అక్టోబరు నాటికి పనులు పూర్తి కావన్న ఉద్దేశంతో మరో నెల గడువు పెంచారు.ఈ గడువు కూడా ముగిసిపోయినా ఎక్కడి పనులు అక్కడే అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి.

అల్లాడిపోతున్న పేషెంట్లు

అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఏరియా ఆస్పత్రిలో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరమ్మతుల పేరుతో పలు వార్డుల్లో మరుగుదొడ్లకు నీటి సరఫరా నిలిపేశారు.పనులు రెండవ అంతస్తులో జరుగుతుండడం వల్ల మొదటి అంతస్తులో వున్న ఆపరేషన్‌ థియేటర్‌కు లీకేజీ సమస్యలు ఎదురయ్యాయి. లీకేజీల కారణంగా రెండుసార్లు ఆపరేషన్‌ థియేటర్‌ మూతపడింది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమవడంతో వైద్య విధానపరిషత్‌ ఉన్నతాధి కారులు స్పందించి వైద్యసేవలు ప్రారంభింపజేశారు. ఆపరేషన్‌ థియేటర్‌లో రెండు మేజర్‌, మరో రెండు మైనర్‌ విభాగాలుండగా ఇప్పటికీ నిర్మాణ పనులతో అడపా దడపా ఆటంకాలు ఎదురవుతూనే వున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న అతిసార (ఐడీహెచ్‌), సర్జికల్‌ వార్డులు 8నెలలుగా మూతపడి వున్నాయి. సర్జికల్‌ వార్డు రోగులను మెడికల్‌వార్డు, వరండాల్లో సర్దుతున్నారు. మెడికల్‌వార్డు పక్కన వరండాలో తాత్కాలికంగా బెడ్లు వేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి అంతస్థులోని కుటుంబ నియంత్రణ వార్డు మూతపడి వుంది.ఇవన్నీ పూర్తయితే వీటిలోకి రోగులను మార్చి ఓపీ, అత్యవసర విభాగం, కాన్పుల వార్డు,చిన్నపిల్లల వార్డు, పోస్టు ఆపరేటివ్‌ వార్డు(బాలింతలు), కార్యాలయాలు, ఫార్మసీ, ఎక్స్‌రే ల్యాబ్‌లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. రెండు వార్డులకే ఇంత కాలయాపన జరగడంతో వీటన్నింటినీ ఎప్పటికీ పూర్తిచేస్తారనేది అంతుబట్టడం లేదు.

భయం గుప్పిట్లో కాన్పుల వార్డు

కాన్పుల వార్డులో గర్భవతులు, బాలింతలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.రెండు వారాల క్రితం కాన్పుల గదిలో శ్లాబ్‌ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.గర్భవతులకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఉండేందుకు కాన్పుల సమయంలో అత్యంత సురక్షితమైన వాతావరణంలో వైద్యం అందించాలి. కానీ కాన్పుల గదిలో లీకేజీలతో పాటు పెచ్చులు ఊడిపడుతున్న కారణంగా తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. కాన్పులకోసం వచ్చే గర్భవతులను గదిబయట వరండాల్లో బెడ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. కాన్పులు మాత్రం విధిలేక పెచ్చులూడిన గదిలోనే నిర్వహించాల్సి వస్తోంది. ఇక కాన్పు తరువాత పురిటిబిడ్డతో సహా బాలింతలను కూడా సాధారణ రోగులతో కలిపి అడ్మిట్‌ చేయాల్సి వస్తోంది.

Updated Date - 2022-12-03T01:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising