ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulasi Reddy: బీసీలకు నిజమైన నేస్తం కాంగ్రెస్సే

ABN, First Publish Date - 2022-12-16T18:56:42+05:30

Vijayawada: అసలైన బీసీ నేస్తం కాంగ్రెస్ (Congress) పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగు బీసీ కమిషన్ల ఏర్పాటు చేయడంతో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: అసలైన బీసీ నేస్తం కాంగ్రెస్ (Congress) పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగు బీసీ కమిషన్ల ఏర్పాటు చేయడంతో పాటు కొన్నివేల బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు స్థాపించామని తెలిపారు. వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కి చైర్మన్‌ను, 12 మంది డైరెక్టర్లను నియమించడం బాగానే ఉన్నా.. కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోతే వాటి వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. గతంలో ఒక కార్పొరేషన్ ఉన్నప్పుడు, లేదంటే మూడు, నాలుగు కార్పొరేషన్లు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లకు ఎక్కువ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులు ప్రవేశపెట్టారని.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పాత వాటికి పేర్లు మార్చి పథకాలను కొనసాగిస్తుందని చెప్పారు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పడు జగనన్న విద్యా దీవెన, స్కాలర్‌షిప్‌.. జగనన్న వసతి దీవన అయ్యిందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-16T18:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising