అభాసు‘పాలు’
ABN, First Publish Date - 2022-04-24T07:08:51+05:30
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఎవ్వ రికీ పాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పోషకవిలువలు కలిగిన ఆహారం అందిస్తున్నామని మంత్రులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా ఆచరణలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
- ఆర్భాటంగా ‘వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ’
మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధీనంలో నడిపే అంగన్‌వాడీ సెంటర్లలో రెండునెలలుగా పాలు అందడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారానికి దూరమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ సెంటర్లకు పోషకాహారంలో భాగంగా అదనంగా పాలు ప్రతినెలా సరఫరా అవుతున్నాయి. కానీ జిల్లావ్యాప్తంగా రెండునెలలుగా ఆయా కేంద్రాలకు పాలు సక్రమంగా రావడంలేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం అభాసుపాలు అవుతోంది.
పిఠాపురం/గొల్లప్రోలురూరల్/భానుగుడి(కాకినాడ), ఏప్రిల్ 23: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఎవ్వ రికీ పాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పోషకవిలువలు కలిగిన ఆహారం అందిస్తున్నామని మంత్రులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా ఆచరణలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గర్భిణులకు, బాలింత లకు నెలకు ఐదు లీటర్ల పాలు, 6 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు నెలకు రెండున్నర లీటర్ల పాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ప్రాథమిక విద్యకోసం కేంద్రా లకు వచ్చే బాలలకు రోజుకు 100 ఎంఎల్ పాలు వేడి చేసి ఇవ్వాలి. అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, రాగిపిండి, చిక్కీలు, నూనె, బియ్యం, కందిపప్పుల తోపాటు పాలు ఇస్తున్నారు. అన్నీ సక్రమంగా అందుతున్నా పాలు మాత్రం అందించడం లేదు. జిల్లాకు అవసరానికంటే తక్కువ సరఫరా రావడంతో పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదు. జిల్లాలో ఫిబ్ర వరిగాను 11,56,300 లీటర్ల పాలు సరఫరా కావాల్సి ఉండ గా 5,72,555 లీటర్లు రాగా, మార్చి నెలకు 11.39 లక్షల లీట ర్లు అవసరం కాగా 3,81,236 లీటర్లు సరఫరా జరిగింది. ఏప్రిల్‌లో ఇంకా పాల సరఫరా పూర్తిస్థాయిలో జరగలేదు.
కాకినాడ ఐసీడీఎస్ పరిధిలో...
కాకినాడ ఐసీడీఎస్ పరిధిలో 7 సెక్టార్లలో 164 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 94 కేంద్రాల్లో పాలసరఫరా అవ్వగా మిగి లిన వాటికి పాలు సరఫరా కాలేదు. రమణయ్యపేట సెక్టార్ లో 20 కేంద్రాలకు, దుమ్ములపేట సెక్టార్, రేచర్లపేట సెక్టా ర్, ప్రతాప్‌నగర్ సెక్టార్‌లకు పాలు సరఫరా అంతంత మాత్రంగా జరిగింది. దీంతో కొన్ని కేంద్రాలకు పాలు సర ఫరా జరగలేదు. ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించ కపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో..
పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో ఏడు సెక్టార్లకు ప్రస్తుతం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 321 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా నెలకు 75వేలనుంచి 80వేల లీటర్ల పాలు అవసరమవుతాయి. ఆరునెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు అందడడం లేదు. గత నెలనుంచి అరకొర సరఫరా ఏడుసెక్టార్ల పరిధిలో పూర్తిగా నిలిచిపోయింది. గతంలో పూర్తిస్థాయి పాలు సరఫరా కాక కొందరికి ఇవ్వలేని పరిస్థితుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలతో బాలింతలు, గర్భిణులు వాదనలకు దిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో అవి ఎప్పుడు వస్తాయో తెలియక, సమాధానం చెప్పలేక అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లలో నాణ్యతా సరిగా ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు, నాణ్యత కలిగిన కోడిగుడ్లును అందజేయాలని పిల్లలు తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.
Updated Date - 2022-04-24T07:08:51+05:30 IST