భయం గుప్పిట్లో ప్రయాణం
ABN, First Publish Date - 2022-12-19T00:08:43+05:30
గోదావరి ఏటిగట్టుపై రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి. మండల పరిధిలో మల్లేశ్వరం నుంచి కానూరు అగ్రహారం వరకు సుమారు 20 కిలోమీటర్లు గోదావరి ఏటిగట్టుపై గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలు వెళ్లేందుకు, లంక భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రయాణిస్తుంటారు.
ఏటిగట్టుపై గోతులు.. రోడ్డు పక్కల పెరిగిన తుప్పలు
మల్లేశ్వరం నుంచి కానూరు అగ్రహారం వరకు ఇదే దుస్థితి
పెరవలి, డిసెంబరు 18: గోదావరి ఏటిగట్టుపై రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి. మండల పరిధిలో మల్లేశ్వరం నుంచి కానూరు అగ్రహారం వరకు సుమారు 20 కిలోమీటర్లు గోదావరి ఏటిగట్టుపై గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలు వెళ్లేందుకు, లంక భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రయాణిస్తుంటారు. రోజూ మోటారుసైకిళ్లు, ఆటోలు, ట్రాక్టర్లు వెళ్తుంటాయి. గతంలో శుభ్రంగా ఉండే ఈ రహదారి రెండు, మూడేళ్లుగా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అధ్వానంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి బాట కూడా మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ మార్గం వెంట ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ రహదారిలో తుప్పలు తొలగించి మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2022-12-19T00:11:51+05:30 IST