ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజ్‌ చేసిన సరుకు ప్రభుత్వానికి జప్తు: జేసీ

ABN, First Publish Date - 2022-10-23T00:30:46+05:30

కాకినాడ సిటీ, అక్టోబరు 22: పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంకులు తదితరాల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి శనివారం నిత్యావసరాల చట్టం-1955, సెక్షన్‌ 6ఎ కింద నమోదైన రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ, అక్టోబరు 22: పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంకులు తదితరాల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి శనివారం నిత్యావసరాల చట్టం-1955, సెక్షన్‌ 6ఎ కింద నమోదైన రెండు కేసులను విచారించి సీజ్‌ చేసిన రూ.25వేలు విలువైన సరుకు ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు జేసీ ఎస్‌.ఇలాక్కియ తెలిపారు. ఈ మేరకు ప్రకటనలో ఎండీ యూ ఆపరేటర్‌కు ఒక నెల జీతాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై సెక్షన్‌ 6ఎ ప్రకారం కేసు నమోదు చేసి తమ దృష్టికి తీసుకురాగా ప్రతివాదులను విచారించి తీసుకోవాల్సిన చర్యలను, సీజ్‌ చేసిన సరుకును ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

శంకరన్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జేసీ ఎస్‌.ఇలాక్కియ అన్నారు. ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ 88వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన విగ్రహానికి జేసీ, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్‌రెడ్డి, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బొడకొండ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఆర్బీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్‌, 93 కులాల బీసీ ఐక్యవేదిక కన్వీనర్‌ మాకిరెడ్డి భాస్కరగణేష్‌, నక్క కిశోర్‌, ఎస్సీ,ఎస్టీ ఫోరం నాయకులు డోకుబుర్ర భద్రం, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి.త్రినాథ్‌, అనిల్‌, పీఎస్‌ నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-23T00:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising