మా ఇష్టం..పేల్చేస్తాం..!
ABN, First Publish Date - 2022-11-13T01:26:41+05:30
జిల్లాలో వందలాది క్వారీల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పేలుళ్లు జరిగిపోతున్నాయి. నిబంధనలతో సంబంధం లేకుండా కొం దరు వైసీపీ నేతలు ఎడాపెడా ఇష్టారీతిన బ్లాస్టింగ్‌లు చేస్తూ బరి తెగిస్తున్నారు. కనీసం భయం లేకుండా ధనార్జనే ధ్యేయంగా చెలరేగి పోతున్నారు.
-జిల్లాలో విచ్చలవిడిగా వైసీపీ నేతలు క్వారీ బ్లాస్టింగ్‌లు
-అధికారం అండతో లీజు అనుమతులు లేకుండానే కొండల తవ్వకాలు
-ఆపై నిబంధనలను కాలరాసి ఇష్టానుసారంగా పేలుడు పదార్థాల వాడకం
-నిర్లక్ష్యం, అజ్రాగత్తలతో తరచూ క్వారీల్లో ప్రమాదాలతో కూలీల మరణాలు
-బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులిచ్చి సెటిల్‌మెంట్లు
-రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో మరీ బరితెగింపు
-కనీసం కన్నెత్తి చూడని గనులు, రెవెన్యూ, పోలీసుశాఖలు
-రౌతులపూడిలో ఓ వైసీపీ నేత క్వారీలో బ్లాస్టింగ్ సమయంలో ప్రమాదం
-ఒకరు మృతి, మరొకరికి రెండుకాళ్లు తీసేయాల్సిన పరిస్థితి: అయినా పైపైకేసులతో సరి
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వందలాది క్వారీల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పేలుళ్లు జరిగిపోతున్నాయి. నిబంధనలతో సంబంధం లేకుండా కొం దరు వైసీపీ నేతలు ఎడాపెడా ఇష్టారీతిన బ్లాస్టింగ్‌లు చేస్తూ బరి తెగిస్తున్నారు. కనీసం భయం లేకుండా ధనార్జనే ధ్యేయంగా చెలరేగి పోతున్నారు. ఈక్రమంలో క్వారీ బ్లాస్టింగ్ సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ఖాతరు చేయడం లేదు. పేలుళ్ల సమయంలో కూలీలు చనిపోతున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎంతోకొంత డబ్బులిచ్చి సెటిల్‌మెంట్లు చేసేసుకుంటున్నారు. కొందరు అధికార పా ర్టీ నేతలు రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో లీజులు, సబ్‌లీజులతో క్వారీలను బెదిరించి హస్తగతం చేసుకోవడం ఒకటైతే అడ్డగోలు బ్లాస్టింగ్‌లతో రెచ్చిపోతున్నా గనులు, రెవెన్యూ, పోలీస్‌శాఖ లు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ క్వారీల్లో ఏం జరిగినా అడిగేవారు లేరంతే.
ఏదైనా చేస్తాం..?
జిల్లాలో రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వం దలకొద్దీ నల్లరాతి కొండలున్నాయి. వీటిలో తవ్వకాలకు లీజుల అనుమతి పదిశాతమే ఉంది. కానీ వీటి ముసుగులో అనధికారికంగా 90శాతం తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. బయటకు ఏమా త్రం ఇవి కనిపించకుండా అక్రమార్కులు అనేక జాగ్రత్తలు తీసుకుం టూ పదుల సంఖ్యలో కొండలను మింగేస్తున్నారు. ప్రధాన రహదారు లను ఆనుకుని ఉన్న కొండలను వదిలేసి వాటి వెనుకనున్న ఎవరికీ కనిపించని భారీ కొండలను మింగేస్తున్నారు. ముఖ్యంగా రౌతులపూ డి మండలంలోని ఎస్.పైడిపాల, మల్లంపేట, ఉప్పంపాలెం, ములగ పూడి, ఏలేశ్వరం మండలంలో లింగంపర్తి, గొంటివానిపాలెం తదితర గ్రామాలు, ప్రత్తిపాడు మండలంలో చిన్న, పెద్దశంకర్లపూడిలో విచ్చల విడిగా క్వారీలు తవ్వుతున్నారు. వీటికి కనీసం అనుమతులు కూడా ఉండడంలేదు. వాస్తవానికి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఈ మూ డు మండలాల్లో ఇంతకుముందు క్వారీ తవ్వకాలు అంతంతే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ కీలక నేత అండ దండలతో కొందరు నేతలు వీటిపై వాలిపోయారు. లీజులతో సం బంధం లేకుండా కనిపించిన కొండలను గుల్ల చేసేస్తున్నారు. కొంద రైతే పెద్ద లీజులదారులను బెదిరించి తవ్వకాలు నిలిపివేయిస్తామనే పేరుతో వాటినీ వశం చేసుకుని సొంతంగా తవ్వుతూ కోట్లకు పడగ లెత్తుతున్నారు. ఈక్రమంలో క్వారీ తవ్వకాలకోసం ఏకంగా అనధికా రిక బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. పెద్దపెద్ద బాంబులు రంథ్రాల్లో కూరి పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో క్వారీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకేసారి భారీ రాయికోసం వీటిల్లో అనుమతులు లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు.
ఎక్స్‌ప్లోజివ్ లైసెన్సులు ఏవీ..
వాస్తవానికి క్వారీల్లో నల్లరాయి తవ్వి తీయాలంటే బ్లాస్టింగ్ కోసం రెవెన్యూ, పోలీసు, చెన్నైనుంచి ఎక్స్‌ప్లోజివ్ లైసెన్సులు తీసుకోవాలి. కానీ పదిశాతం క్వారీలకు కూడా ఇవి లేవు. అయినా పేలుడు పదా ర్థాలు తెచ్చి కొండపై నిల్వ చేస్తున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు గనుల శాఖ, రెవెన్యూశాఖ, పోలీసులు తనిఖీలు చేయాలి. కానీ ఇవి అత్యం త మారుమూల ప్రాంతాల్లో ఉండడం, అవి కూడా వైసీపీ నేతలవి కావడంతో అటువైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో తమ జోలికి ఎవరూ రారనే ధీమాతో సదరు నేతలు తమ అనధికారిక క్వారీల్లో రిజర్వు ఫారెస్ట్‌ల్లోకి కూడా చొరబడి కొండలను తవ్వేస్తున్నారు. ఇందు కోసం భారీ రంథ్రాలు ఏర్పాటు చేసి మందుగుండు కూరుతున్నారు. ఇవి నిపుణుల సమక్షంలోనే చేయాలి. కానీ తనిఖీలు లేకపోవడంతో సాధారణ కూలీలతో బ్లాస్టింగ్‌లు చేయిస్తున్నారు. దీంతో ఈ మూడు మండలాల క్వారీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూ అనేకమంది కూలీలు చనిపోతున్నారు. ఈ ప్రమాదాలేవీ బయటకు రాకుండా సదరు నేతలు గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్లు చేసేస్తున్నారు. కనీసం పోలీసు కేసులు కూడా నమోదవడం లేదు. ఒకవేళ చేసినా మొక్కుబడి కేసులతో మమ అనిపిస్తున్నారు.
Updated Date - 2022-11-13T01:26:43+05:30 IST