ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖండ దోపిడీకి స్కెచ్‌!

ABN, First Publish Date - 2022-10-30T00:47:02+05:30

ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం జేపీ సంస్థకు ఇసుక ర్యాంపులన్నీ కాంట్రాక్టుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఒక ఏడాదంతా జేపీ సంస్థ ఇసుక విక్రయాలు నిర్వహించింది.

రాజమహేంద్రవరం ర్యాంపులో సాగుతున్న తవ్వకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ర్యాంపులపై పలువురి పెత్తనం

జిల్లా ఇసుక ఇన్‌చార్జి ఆంజనేయరెడ్డి?

సీఎం జగన్‌ అనుచరులమంటూ దందా

బుర్రిలంక ర్యాంపులో ఘటనే ఉదాహరణ

దళిత నేత.. వైసీపీ నాయకుడికే రిమాండ్‌

స్థానిక ప్రజాప్రతినిధులకు దక్కని వాటా

రాజమహేంద్రవరం/కడియం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం జేపీ సంస్థకు ఇసుక ర్యాంపులన్నీ కాంట్రాక్టుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఒక ఏడాదంతా జేపీ సంస్థ ఇసుక విక్రయాలు నిర్వహించింది. ఇటీవల కేకేఆర్‌ అనే సంస్థకు సబ్‌ లీజుకు ఇచ్చి జేపీ సంస్థ తప్పుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తు తం కేకేఆర్‌ అనే సంస్థ పేరుతో ఇసుక వ్యాపారులు పెత్తనం ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ప్రక్కన పెట్టి ఎక్కడి నుంచో వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు అన్ని ర్యాంపుల మీద పెత్తనం మొదలుపెట్టారు. గోదావరిలో అనధికారికంగారాత్రివేళల్లో డ్రెడ్జింగ్‌ చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు.ఇది సరిపోదన్నట్టు ఓపెన్‌ ర్యాంపు లపై దృష్టి పెట్టారు.వేరే జిల్లాకు చెందిన ఆంజనేయరెడ్డి ఈ జిల్లాకు ఇసుక ర్యాంపుల ఇన్‌చార్జినని చెప్పుకుంటున్నట్టు వైసీపీ నేతలు,ర్యాంపుల్లో పనిచేసేవారూ చెబుతుండడం గమనార్హం.

ర్యాంపులపై ఎవరెవరిదో పెత్తనం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఓపెన్‌, డీసిల్టేషన్‌ ర్యాంపులు సుమారు 18 వరకూ ఉన్నాయి. మరో 28 ర్యాంపులకు అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే వారంలో వీటిలో చాలా వరకూ ప్రారంభమమయ్యే అవకాశం ఉంది. జేపీ సంస్థ నేరుగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరు బాటచార్జీలు, పార్కింగ్‌ చార్జీల పేరిట తమ అనుచరులతో కొంత సొమ్ములు వసూళ్లు చేసుకునేవారు. ప్రస్తుతం జేపీ సంస్థ తప్పుకోవడంతో సీఎం జగన్‌ తనకు తెలుసునని, ఫలానా మంత్రికి తాను దగ్గరని చెబుతూ మొత్తం ర్యాంపులపై పలువురు పెత్తనం చెలాయిస్తు న్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా రాత్రి వేళల్లో సుమారు 20కు పైగా డ్రెడ్జర్లు పెట్టి ఇసుక తోడేస్తున్నారు. ఇది రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య అఖండగోదావరిలో అధికంగా జరుగుతోంది.ఇక ఓపెన్‌ ర్యాంపులను ఈ వ్యక్తులే స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియం మండలంలోని వేమగిరి- బుర్రిలంక ర్యాంపు బాట సొమ్ము విషయం లో నిలదీసినందుకు వైసీపీకే చెందిన దళిత నేతను అరెస్ట్‌ చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.

బాట లీజు అడిగితే.. దళిత నేత అరెస్టు..

ఇసుక ర్యాంపుల వివాదంలో వైసీపీ దళిత నాయకుడు, కడియపులంక మాజీ సర్పంచ్‌ భర్త, మాజీ ఎంపీటీసీ వారా రామును అరెస్ట్‌ చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించడం పెద్ద వివాదంగా మారింది. వేమగిరి- బుర్రిలంక ఇసుక ర్యాంపునకు వెళ్లే దారిలో 132 మంది దళితులు 1972 నుంచి 66 ఎకరాల భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపులోకి ఈ పొలాల నుంచే వెళ్లవలసి ఉంది.ఈ మేరకు జేపీ సంస్థ పొ లాల నుంచి బాటను లీజుకు తీసుకుని ఏడాదికి రూ.12 లక్షలు ఇచ్చేవారు.ఈ నెల 28న ఆంజనేయరెడ్డి అనుచరులమని చెప్పి ర్యాంపునకు వచ్చిన వారిని వారా రాము ఆధ్వర్యం లో పలువురు బాట లీజు సొమ్ము డిమాండ్‌ చేశారు. నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో ధర్నాకు దిగారు.వైసీపీ రూరల్‌ కో ఆర్డి నేటర్‌ చందన నాగేశ్వర్‌ వచ్చి దళితులతో మాట్లాడి ఆం దోళన విరమింపజేశారు.

కేసు పెట్టిన వారే.. అరెస్టయ్యారు..

ముగ్గురు రెడ్లపై దళితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఏమైందో కానీ కడియం సీఐ తిలక్‌ శుక్రవారం రాత్రి రామును స్టేషన్‌కు పిలిపించి అక్కడే కూర్చోపెట్టేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాంపు నిర్వాహకులైన ముగ్గురు రెడ్లను స్టేషన్‌కు రప్పించి, మరో ఫిర్యాదు తీసుకుని రామును అరెస్ట్‌ చేసినట్టు ప్రకటించారు. శనివారం కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించారు. అతనిపై 341, 384 సెక్షన్ల క్రింద కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. అయితే కొత్తగా 389 సెక్షన్‌ క్రింద మరో కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించడంతో రాముకు రిమాండ్‌ అనివార్యమైంది.దీనిపై దళిత నాయకులు మండిపడుతున్నా రు. ఇది కక్షసాధింపు చర్య అని మండల వైసీపీ కో ఆర్డినేనటర్‌, జేగురుపాడు సర్పంచ్‌ యాదల సతీష్‌ చంద్రస్టాలిన్‌, దళిత నాయకులు బడుగు చిన్ని, విప్పర్తి ఫణి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వివాదానికే కేసులు, అరెస్టులు, రిమాండ్‌లు జరగడంపై వైసీపీ ప్రభుత్వం ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే నమోదైనట్టు చర్చ జరుగుతోంది. దీంతో రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ తదితర ప్రాంతాల దళితుల్లో ఆగ్రహం మొదలైంది. తాము ఓటేసి గెలిపిస్తే.. తమనే జైలుకు పంపిస్తారనే విమర్శలు మొదలయ్యాయి.రాముకు బెయిల్‌ మంజూరైనప్పటికీ సెంట్రల్‌ జైలు నిబంధ నల ప్రకారం సమయం ముగియడంతో వారా రాము విడుదలకు జైలు అధికారులు నిరాకరించినట్టు తెలుస్తుంది. నేడు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఎంపీ, కోఆర్డినేటర్ల మౌనం?

వైసీపీలో ఇసుక ర్యాంపు చిచ్చుపెట్టింది. వైసీపీకి ఓట్లేసి తప్పు చేశామనే పరిస్థితికి దళితుల్లో ఆలోచన మొదలైంది. వైసీపీ దళితనేతను సెంట్రల్‌ జైలుకు పంపించినాఎంపీ మార్గాని భరత్‌, రూరల్‌ వైసీపీ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ మౌనంగా ఉండడాన్ని దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌కు పోలీసులు చెప్పడంతోనే రాము పోలీసు స్టేషన్‌కు వెళ్లారని పట్టించుకో కపోతే ఎలా అని మండిపడుతున్నారు. దీని వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు దళితులు భావిస్తున్నారు. కడియం మండలంలో వైసీపీ దళితులంతా తమ పదవులకు రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాజమహేంద్రవరం రూరల్‌, సిటీ నియోజకవర్గాలలో వైసీపీలో దళితులకు గుర్తింపు లేదని, కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులు కానీ, ఇతర నామినేనెట్‌ పదవులు కానీ ఇవ్వలేదని, కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వంటి పదవులు కూడా రానీయలేదనే వాదన ఉంది. ఇటీవల జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుల్లో దళితులకు స్థానం కల్పించలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ర్యాంపు వెనుక పెద్ద కథ?

ఈ ర్యాంపు వెనుక పెద్ద కథే ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర రీజియన్‌లో ఇంతవరకూ పెత్తనం చేసిన ఓ పెద్దాయన అల్లుడికి చెందిన వర్గమే ఈ ర్యాంపుపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరిట భూములు కొనుగోలు చేయడం,ఆక్రయించుకోవడంతో రియల్‌ ఎస్టేట్‌ పెంచే ప్రయత్నం జరగడం తో అక్కడకు అవసరమైన ఇసుకను ర్యాంపు నుంచి తరలించే యోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది రాజమహేంద్రవరం -విశాఖ హైవే పక్కన ఉన్న ర్యాంపు. ర్యాం పులో ఇసుక లోడు చేసిన లారీలు నేరుగా హైవేలోకి రా వచ్చు.రాత్రి పగలూ ఇబ్బంది ఉండదు. అందువల్లే ఈ ర్యాంపుపై అధ్యయనం చేసి దీనిని వాడుకునే ప్రయత్నం మొదలెట్టినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు ఎంత వరకూ దారితీస్తాయోమరి.

Updated Date - 2022-10-30T00:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising