ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Special Trains: ఏపీలో నవంబర్ 2 నుంచి స్పెషల్ ట్రైన్స్ .. ఆ ట్రైన్స్, టైమింగ్స్ లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-10-31T13:24:10+05:30

శీతాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విశాఖ-విజయవాడ రైల్వే లైన్‌లో పలు ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట: శీతాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విశాఖ-విజయవాడ రైల్వే లైన్‌లో పలు ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే సీపీఆర్వో అధికారి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

  • 08579 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ నుంచి నవంబరు 2 బుధవారం రాత్రి 07.00 నిమిషాలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం మీదుగా సామర్లకోటకు 8.58కు చేరుకుని 9.00కు బయలుదేరుతుంది. రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌కు ఉదయం 8.20 నిమిషాలకు చేరుకుంటుంది.

  • 08580 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నవంబరు 3న గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. సామర్లకోటకు తెల్లవారుజామున 3.55కి చేరుకుని 3.57 నిమిషాలకు బయలుదేరి అనకాపల్లి మీదుగా విశాఖకు ఉదయం 6.45 నిముషాలకు చేరుతుంది. ఈ రైళ్లు నవంబరు 2,9,16,23,30లో విశాఖ నుంచి, నవంబరు 3,10,17,24, డిసెంబరు1లో సికింద్రాబాద్‌ నుంచి నెలకు 5 ట్రిప్‌లుగా బయలుదేరుతాయి.

  • 08585 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 1 మంగళవారం విశాఖపట్నం నుంచి సాయంత్రం 5.35 నిమిషాలకు బయలుదేరి దువ్వాడ మీదుగా సామర్లకోటకు రాత్రి 6.48 నిమిషాలకు చేరుకుని తిరిగి 6.50 నిమిషాలకు బయలుదేరి రాజమహేంధ్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్లల మీదుగా మహబూబ్‌నగర్‌కు ఉదయం 10.30 నిమిషాలకు చేరుతుంది.

  • 08586 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రె్‌స రైలు మహబూబ్‌నగర్‌లో నవంబరు 2న రాత్రి 6.20 గంటలకు బయలుదేరి జడ్చర్ల, కాచిగూడ, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం మీదుగా సామర్లకోటకు ఉదయం 6.25కి చేరుకుని తిరిగి 6.27కి దువ్వాడ మీదుగా విశాఖపట్నంకు ఉదయం 9.50 నిమిషాలకు చేరుతుంది. ఈ రైళ్ళు విశాఖ నుంచి నవంబరు 1,8,15,22,29లలోనూ మహబూబ్‌నగర్‌ నుంచి నవంబరు 2,9,16,23,30లలో 5 ట్రిప్‌లుగా బయలుదేరుతాయి.

  • 08583 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ నుంచి నవంబరు7న సోమవారం రాత్రి 7.10కి బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం మీదుగా సామర్లకోటకు రాత్రి 7.04కి చేరుకుని తిరిగి 7.06కి బయలుదేరి రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి మంగళవారం ఉదయం 9.15 నిమిషాలకు చేరుతుంది.

  • 08584 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 8న మంగళవారం రాత్రి 9.55 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంధ్రవరం మీదుగా సామర్లకోటకు బుధవారం ఉదయం 6.53కు చేరుకుని తిరిగి 6.55కు బయలుదేరి అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్నానికి ఉదయం 10.15 నిమిషాలకు చేరుతుంది.

ఈ రైళ్లు విశాఖ నుంచి నవంబరు 7,14,21,28లలోనూ, తిరుపతి నుంచి నవంబరు 8,15,22,29లలో నెలకు 4 ట్రిప్‌లుగా బయలుదేరుతాయి.ఈ ప్రత్యేక రైళ్లకు చెందిన రిజర్వేషన్‌ టిక్కెట్ల సమాచారం కోసం సమీప రైల్వే బుకింగ్‌ కేంద్రాలను సంప్రదించాలని రైల్వే సీపీఆర్వో అధికారి తెలిపారు.

Updated Date - 2022-10-31T15:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising