టిడ్కో ఇళ్లను ఎందుకివ్వరు?
ABN, First Publish Date - 2022-08-31T06:50:48+05:30
మండపేట పట్టణంలో ఫేజ్ 1లో నిర్మించిన ఇళ్లను ఏడాదికాలం నుంచి అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ వైసీపీ ప్రభుత్వం కాల యాపన చేస్తోంది.
టీడీపీ కట్టిందనే మౌలిక వసతుల కల్పన పేరిట జాప్యం
లబ్ధిదారులకు ఇవ్వకుంటే ప్రజా ఆందోళన చేపడతాం : వేగుళ్ల
మండపేట, ఆగస్టు 30 : మండపేట పట్టణంలో ఫేజ్ 1లో నిర్మించిన ఇళ్లను ఏడాదికాలం నుంచి అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ వైసీపీ ప్రభుత్వం కాల యాపన చేస్తోంది. ఎప్పుడు ఈ ఇళ్లను ఇస్తారో స్పష్టం చేయకుండా జాప్యం చేయడంపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ సమావేశంలో టిడ్కో ఇళ్లపై తమ కౌన్సిలర్లు, తాను కలిసి ఎప్పుడు టిడ్కో ఇళ్లు ఇస్తారో తేదీ చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చైర్‌ప ర్సన్ రాణిలు ఈ అంశం అజెండాలో లేదని దాటవేశారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల సమస్య ప్రజాసమస్య కాదా? 24 వేల మంది లబ్ధిదారుల సమస్యను మున్సి పల్ సమావేశంలో తాను ప్రస్తావించడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. తాను టిడ్కో ఇళ్ల గురించి మాట్లాడితే దాన్ని తన సొంత అజెండాగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడడం ఎంతవరకు సబబని వేగుళ్ల ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లను ఇచ్చేందుకు ఫేజ్ 1కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని టిడ్కో అధి కారులు చెబుతుంటే అధికార పార్టీకి చెందినవారు మాత్రం ఇళ్లను ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేవలం టీడీపీ కట్టిందనే కారణంతోనే ఈవిధంగా చేస్తున్నారని, తాను లబ్ధిదారుల తరపున పోరాటం చేస్తు న్నానని చెప్పారు. అలాగే మండపేట-ద్వారపూడి రోడ్డు కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు రూ.10 కోట్లను మంజూరు చేసిన విషయం అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న తోటకు తెలియదా అని వేగుళ్ల ప్రశ్నిం చారు. ఈ ఏడాది జూన్‌లో ఎమ్మెల్సీ తోట మండపేట-ద్వారపూడి రోడ్డుకు భూమి పూజ చేశారని, ఇప్పటివరకు ఏం చేశారని వేగుళ్ల ప్రశ్నించారు. మండపేట- ద్వార పూడి రోడ్డు నిర్మాణం విషయంలో జాప్యంపై రహదారులు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండపేట నియోజకవర్గంలో పనిచేయాలంటేనే కంట్రాక్టర్‌లెవరూ ముందుకు రావడం లేదని మూడు నెలల కిందట జడ్పీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వేగుళ్ల గుర్తుచేశారు. అలాగే మండపేట నియెజకవర్గంలో తాను డబ్బు సంచులతో వస్తానని ఆరోపించడాన్ని వేగుళ్ల తోసిపుచ్చారు. తోట రామచం ద్రపురంలో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కేసులకు భయపడి పార్టీ మారి అధికార పార్టీలో చేరి మండపేటకు వచ్చిన తోట గురించి ఇక్కడ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్లతోపాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషిచేసి సాధిం చారని, మరి మీరేమి సాధించారని తోటను వేగుళ్ల ప్రశ్నించారు. ఇప్పటికైనా టిడ్కో ఇళ్లను ఎప్పుడు లబ్ధిదారులకు ఇస్తారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రుశ్రీవరప్రకాష్, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మందపల్లి దొరబాబు, టీడీపీ కౌన్సిలర్‌లు చుండ్రు చిన సుబ్బా రావు చౌదరి, కాశీన కాశీ, కాళ్లకూరి స్వరాజ్యభవాని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-31T06:50:48+05:30 IST