ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla Madhav: నిజం నిప్పులాంటిది.. కప్పిపుచ్చలేరు: పట్టాభి

ABN, First Publish Date - 2022-08-19T00:29:09+05:30

ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Video)పై ఇంకా దుమారం రేగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Video)పై ఇంకా దుమారం రేగుతోంది. మాధవ్ వీడియో కాల్ (video call) ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అని  ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ల్యాబ్కు పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదని సునీల్ కుమార్ కొట్టిపారేశారు. సునీల్కుమార్ వ్యాఖ్యలపై టీడీపీ నేత పట్టాభి (TDP leader Pattabhi) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేమ్స్ స్టాఫర్డ్ రిపోర్ట్ తప్పని చెప్పడం సరికాదని తోచిపుచ్చారు. జేమ్స్ స్టాఫర్డ్ రిపోర్ట్ వందకు వంద శాతం వాస్తవమని స్పష్టం చేశారు. జేమ్స్ స్టాఫర్డ్కు తాము పంపిన ఈమెయిల్స్, అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిజం నిప్పులాంటిది.. కప్పిపుచ్చలేరన్నారు. డర్టీ పిక్చర్ ఎంపీని వెనకేసుకు రావడం సిగ్గుచేటని పట్టాభి దుయ్యబట్టారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పట్టించుకోని సీఐడీ (CID).. ఇప్పుడు తమను బెదిరిస్తోందని మండిపడ్డారు. అన్నిరకాల పరిశోధనలు చేసి జేమ్స్స్టాఫర్డ్ నుంచి నివేదిక తెస్తే.. తమపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, త్వరలోనే నివేదిక పూర్తి వివరాలు ప్రజల ముందుంచుతామని ప్రకటించారు. టీడీపీ నేతలకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమాలను ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. మాధవ్ బూతు వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-19T00:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising