గోటేటి రామచంద్రరావు కన్నుమూత

ABN, First Publish Date - 2022-10-27T03:39:57+05:30

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కార్యదర్శిగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు బుధవారం కన్నుమూశారు.

 గోటేటి రామచంద్రరావు కన్నుమూత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ హయాంలో సీఎంవో ఓఎస్డీగా సేవలు

అనంతరం కార్యదర్శిగా, సలహాదారుగా బాధ్యతలు

నరసాపురం, అక్టోబరు 26: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కార్యదర్శిగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు బుధవారం కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన రామచంద్రరావు వైఎన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్ధాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌కు అవసరమైన ప్రసంగాలను రామచంద్రరావు తయారుచేసి పంపించేవారు. అప్పటివరకు వారి మధ్య పరిచయం లేదు. ప్రచారంలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ ఆయన్ను కలిశారు.

ఆయన మేధోశక్తిని గుర్తించిన రామారావు.. ముఖ్యమంత్రి కాగానే రామచంద్రరావును హైదరాబాద్‌ను పిలిపించి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా నియమించుకున్నారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఎన్టీఆర్‌ ఉన్నంత కాలం రామచంద్రరావు సలహదారుగా కొనసాగారు. 1983లో నరసాపురం నుంచి వెళ్లిన గోటేటి హైదరాబాద్‌లోనే స్దిరపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రరావు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన మృతికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు జానకిరామ్‌, బండారు మాధవనాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు తదితరులు సంతాపం తెలిపారు.

రామచంద్రరావు మృతి విచారకరం: చంద్రబాబు

అమరావతి: స్వర్గీయ ఎన్టీఆర్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు మరణం విచారం కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్‌ వేదికగా రా మచంద్రరావు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-10-27T03:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising