ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎస్‌ఎల్వీ-సి52 ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2022-02-12T23:50:15+05:30

పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌ రోదసీ యానాకి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. సోమవారం ఉదయం 5.59 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్‌ రోదసీ యానాకి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. సోమవారం ఉదయం 5.59 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు లాంచ్‌ ఆథరైజేషన్‌ అంగీకారం  తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగ సన్నహాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం షార్‌లో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశంలో ఇస్రో నూతన చీఫ్‌ ఎస్‌ సోమనాధ్‌ పాల్గొన్నారు. సాయంత్రం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4:29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ కొనసాగించి, సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి52 రాకెట్‌ రోదసీలోకి దూసుకుపోనుంది.

Updated Date - 2022-02-12T23:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising