ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సత్తెనపల్లి మండలంలో మంత్రి అంబటికి ఝులక్..

ABN, First Publish Date - 2022-11-28T13:59:18+05:30

మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu)కు సొంతపార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. సత్తెనపల్లి మండలం, వెన్నాదేవిలో మంత్రి అంబటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu)కు సొంతపార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. సత్తెనపల్లి మండలం, వెన్నాదేవిలో మంత్రి అంబటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ హాజరుకాలేదు. సర్పంచ్ లేకుండా మంత్రి అంబటి తిరగడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెన్నాదేవి సర్పంచ్ గత కొంతకాలంగా మంత్రిపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరుకాలేదు. సర్పంచ్ లేకుండా తిరిగితే గ్రామ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని స్థానికులు ప్రశ్నించారు. ఇక సొంతపార్టీ నేతలు సర్పంచ్ లేకుండానే మంత్రి గడపగడపకు కార్యక్రమాన్ని మమా అనిపించారు.

మొక్కుబడిగా తంతు నిర్వహించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు రోజు రోజుకు అసమ్మతి పెరుగుతోంది. ఇంత వరకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా ఇప్పుడు ఏకంగా సొంతపార్టీ నేతలనుంచే మంత్రికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఎన్ని గ్రామ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో నిరసనగా మంత్రి అంబటి కార్యక్రమానికి సర్పంచ్ దూరంగా ఉన్నారు. గ్రామంలో ఉండి కూడా సర్పంచ్ మంత్రి కార్యక్రమంలో పాల్గొనలేదు.

Updated Date - 2022-11-28T13:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising