Guntur: గుంటూరు మీదుగా హైదరాబాద్కు ఈ ట్రైన్ ఉందని తెలుసా..!
ABN, First Publish Date - 2022-11-14T08:54:46+05:30
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి ఆదివారం ఒక ప్రకటనలో..
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు (Guntur) మీదగా రెండు ప్రత్యేక రైళ్లను (Two Special Trains) నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెంబరు.07484 తిరుపతి - కాచీగూడ రైలు (TPT to KCG) ఈనెల 14న సోమవారం రాత్రి 8.10కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.08కి తెనాలి (Tenali), 1.50కి గుంటూరు (Guntur), 2.30కి సత్తెనపల్లి (Sattenapalli), 3 గంటలకు నడికుడి (Nadikudi), మంగళవారం ఉదయం 9.15కి కాచీగూడ (Kachiguda) చేరుకొంటుంది. నెంబరు. 07612 కాచీగూడ - నరసపూర్ రైలు (KCG to NSP) ఈనెల 15న రాత్రి 8.30కి బయలుదేరి 11.55కి పిడుగురాళ్ల, అర్ధరాత్రి దాటాక 12.20కి సత్తెనపల్లి, 1.45కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు నరసపూర్ చేరుకొంటుంది.
Updated Date - 2022-11-14T08:55:52+05:30 IST