AP Highcourt judge: మీ రాజధాని ఏదంటూ మా అమ్మాయిని ఆటపట్టిస్తున్నారు
ABN, First Publish Date - 2022-09-18T18:34:53+05:30
తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అంటూ హైకోర్టు జడ్జి (Highcourt judge) జస్టిస్ బట్టు దేవానంద్ (Battu devanand) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరరాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు. ‘‘మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె ఢిల్లీలోని కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్యపరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది’’ అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా హైకోర్టు జడ్జి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-09-18T18:34:53+05:30 IST