ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ-ఆంధ్ర మధ్య ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి!

ABN, First Publish Date - 2022-10-14T07:23:19+05:30

భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ నడుమ నిర్మించబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దేశంలోనే తొలి భారీ నిర్మాణం..
  •  వంతెన పొడవునా గ్లాస్‌ వాక్‌వే
  • పర్యాటకానికి కొత్త రూపు.. 
  • 1,082 కోట్లతో 30 నెలల్లో పూర్తి
  • హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 80 కి.మీ. ప్రయాణం తగ్గుతుంది: గడ్కరీ 

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ నడుమ నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ట్విటర్‌లో ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా-కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఇది నిర్మితం కానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే ఉంటుందని.. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని వివరించారు.

Updated Date - 2022-10-14T07:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising