ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN, First Publish Date - 2022-11-05T23:03:10+05:30
రైతులు పండించిన సజ్జ, మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు తెలిపారు. మన్నేపల్లి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
తాళ్లూరు, నవంబరు 5: రైతులు పండించిన సజ్జ, మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు తెలిపారు. మన్నేపల్లి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతుల వద్దగల ధాన్యాన్ని ఇతరప్రాంతాలకు వెళ్లి విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసు వెళ్లి అమ్ముకోవచ్చన్నారు. బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరకంటే ఎక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నారు. మన్నేపల్లి సొసైటీ చైర్మన్ మంచాల వలసారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో సజ్జక్వింటా రూ. 2, 350కు, మొక్కజొన్న రూ. 1,962 లకు కొనుగోలు చేస్తారన్నారు. రైతులు తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఈ-క్రాప్ నమోదు పత్రాలను తీసుకు వచ్చి సజ్జ, మొక్కజొన్నలను విక్రయించాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఎం.వలసారెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్‌పీ నాగార్జునరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, మాజీ మార్కెట్ డైరెక్టర్ దారం రమణారెడ్డి, సీఈవో అన్నపురెడ్డి అంజిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ
తాళ్లూరు-1, బొద్దికూరపాడు రైతుభరోసాకేంద్రాల వద్ద శనివారం సబ్సిడీపై శనగవిత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. మండలవ్యవసాయాధికారి బి.ప్రసాదరావు మాట్లాడుతూ శనగలు 25శాతం సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. క్వింటా జెజె-11 రకం విత్తనాలు సబ్సిడీ పోను రూ.4,842లు ,కాక్-2 రకం సమ్సొడీ పోను రూ. 6,642లకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి,సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాద్‌రెడ్డి, ఈవోఆర్‌డీ ఎన్.యు ప్రసన్నకుమార్ ఏఈవో నాగరాజు, వీఏఏలు నాగరాజు నాయక్,అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-05T23:03:15+05:30 IST