ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుష్ఠు వ్యాధి వ్యాప్తి, నివారణపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-11-16T23:02:52+05:30

కుష్ఠు వ్యాధి వ్యాప్తి, నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్థానిక పీహెచసీ సిబ్బంది తెలిపారు.

కోటకాడపల్లి లో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామసముద్రం, నవంబరు 16: కుష్ఠు వ్యాధి వ్యాప్తి, నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్థానిక పీహెచసీ సిబ్బంది తెలిపారు. కుష్ఠు నివారణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు నిర్థారణ పరీక్ష చేయించుకో వాలన్నారు. మెరుగైన వైద్యం తీసుకుంటే వ్యాధి తొందరగా నయం అవుతుందని సూచించారు. ఈ కార్య క్రమంలో వైద్యసిబ్బంది రమణ, హరి, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

పెద్దమండ్యం: కుష్ఠువ్యాధి నివారణకు వైద్య సిబ్బంది కృషి చేయాలని పీహెచసీ వైద్యాధి కారులు ఇమ్మాన్యుయేల్‌, హరివర్మ పిలుపు నిచ్చారు. బుధవారం వారు మాట్లాడుతూ జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 5వ తేదీ వరకు ఈ సర్వే జరుగుతుందన్నారు. స్పర్శ లేని కణాలు ఉన్న వారు వెంటనే వైద్యాధికారులకు సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలనకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు వైద్య సిబ్బందికి సహకరించి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సీహెచవో కృష్ణయ్య, సూపర్‌వైజర్లు ప్రసన్నకుమారి, రెడ్డిరాణి, ఆశ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising