ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-10-30T23:57:13+05:30

అసాంఘిక శక్తులపట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని టూటౌన సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సబ్‌డివిజన పరిధిలోని పోలీస్‌ సిబ్బందితో కలసి మదనపల్లె పట్టణ శివారులోని చంద్రాకాలనీలో కార్డెన సెర్చ్‌ నిర్వహించారు.

ప్రజలతో మాట్లాడుతున్న సీఐ మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానితులు సంచరిస్తే సమాచారమివ్వండి : టూటౌన సీఐ మురళీకృష్ణ నారమాకులతాండాలో పోలీసుల దాడులు

మదనపల్లె క్రైం, అక్టోబరు 30: అసాంఘిక శక్తులపట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని టూటౌన సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సబ్‌డివిజన పరిధిలోని పోలీస్‌ సిబ్బందితో కలసి మదనపల్లె పట్టణ శివారులోని చంద్రాకాలనీలో కార్డెన సెర్చ్‌ నిర్వహించారు. ముఖ్యంగా వీధులను చుట్టిముట్టి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ప్రజల రేషన, ఆధార్‌, ఐడీకార్డులను పరిశీలించారు. అదేవిధంగా వారి వృత్తి, కుటుంబ సభ్యు ల సంఖ్య, ఇతర అంశాలపై ఆరా తీశారు. అదేవిధంగా కొత్త వ్యక్తులను విచారించి వారి చిరునామా సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మా ట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లు, పాతనేరస్థులు తిరుగుతున్నట్లు తమకు సమా చారం వచ్చిందని వారికి ఆశ్రయం కల్పిస్తే కఠినచర్యలు తీసు కుంటామన్నారు. ముఖ్యంగా పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తూ నేరాల నివార ణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్సీ లేని 19 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి స్టేషనకు తరలించారు. దీంతోపాటు స్థానిక చిల్లర దుకా ణ వ్యాపారి రాధాకృష్ణను అరెస్టు చేసి అతని నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో తాలూకా సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

నారమాకులతాండాలో పోలీసుల దాడులు

మదనపల్లె మండలం నారమాకులతాండాలో ఆదివారం తాలూ కా ఎస్‌ఐ సుధాకర్‌ సిబ్బందితో కలసి తాండా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సారా తయారీ కేంద్రాలను గుర్తించా రు. ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వఉంచిన ఊటను ధ్వంసం చేశామన్నారు. అలాగే పలు వురి సారా విక్రేతలను అరెస్టు చేసి సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తాండా సమీపంలోని అటవీ ప్రాంతాల్లో బట్టీలు ఏర్పాటు చేసి సారా తయారీ చేస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సారా నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Updated Date - 2022-10-30T23:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising