ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు పోతున్నా రోడ్డు వేయరా.. !

ABN, First Publish Date - 2022-11-10T23:21:45+05:30

కోడూరు-చిట్వేలి రోడ్డులో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికార పార్టీ నాయకులకు పట్టదా అని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రశ్నించారు.

రైల్వేకోడూరు నుంచి పాదయాత్ర చేస్తున్న జనసైనికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర

రైల్వేకోడూరు/చిట్వేలి, నవంబరు 10: కోడూరు-చిట్వేలి రోడ్డులో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికార పార్టీ నాయకులకు పట్టదా అని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రశ్నించారు. గురువారం కోడూరు-చిట్వేలి డబుల్‌ రోడ్డు కొరకు రైల్వేకోడూరు జనసేన కార్యా లయం నుంచి చేపట్టిన పాదయాత్రలో జనసేన నాయకులకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్య అతిథిగా తిరుపతి నియోజకవర్గ నాయకుడు పసుపులేటి హరిప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం చిట్వేలిలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. చిట్వేలి మండల టీడీపీ అధ్యక్షుడు కె.కె.చౌదరితో కలిసి టీడీపీ నాయకులు, రాజుకుంట సర్పంచ్‌ గుత్తి నరసింహ, ఎంపీటీసీ నాగార్జున పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార ఎమ్మెల్యే చిట్వేలి-కోడూరు రోడ్డు ఎందుకు వేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. చిట్వేలి ప్రజల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అన్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో వీఆర్వో రామసుబ్బారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జోగినేని మణీ, పగడాల వెంకటేష్‌, మాదాసు నరసింహ, కంచర్ల సుధీర్‌రెడ్డి, పగడాల శివ, తేజ, జనసేన వీరమహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-10T23:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising