టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T22:55:08+05:30
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్య కర్త కృషి చేయాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు 16: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్య కర్త కృషి చేయాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర వారం కోనంపేటలో ఆయన పర్యటించారు. సీనియర్ టీడీపీ కార్యకర్తలను పలకరిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కార్యక ర్తలు కూడా ఇంటింటికి వెళ్లి ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె సర్పంచ్ చెండ్రాయుడు, లక్ష్మినారాయణ, రెస్కో మాజీ చైర్మన్ యర్రంరెడ్డి, రామిరెడ్డి, నాగార్జున, వెంకటనారాయణ, రామాంజుల్ రెడ్డి, మురళీభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T22:55:11+05:30 IST