Kadapa: కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన
ABN, First Publish Date - 2022-12-05T16:36:15+05:30
సీఎం జగన్ (CM Jagan) సొంత జిల్లా కడప రాజోలి రిజర్వాయర్ (Rajoli Reservoir) నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు (Farmers) కలెక్టరేట్ వద్ద నిరసన (Protest) చేపట్టారు.
కడప జిల్లా: సీఎం జగన్ (CM Jagan) సొంత జిల్లా కడప రాజోలి రిజర్వాయర్ (Rajoli Reservoir) నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు (Farmers) కలెక్టరేట్ వద్ద నిరసన (Protest) చేపట్టారు. రాజోలి కింద ముంపుకు గురయ్యే పెద్ద ముడియం మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో 9వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఆ భూముల నష్టపరిహరం తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
రాజోలి రిజర్వాయర్ నిర్మాణం కోసం 9 నెలల క్రితం భూ సేకరణ చేసిన అధికారులు మూడు నెలల్లో మొత్తం నష్టపరిహారం, పునరావాస ప్యాకేజి ఇస్తామని చెప్పి తమ భూముల పత్రాలు తీసుకున్నా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ముడియం మండలంలోని ఉప్పలూరు, నెమళ్లదిన్నె, బలపలగూడూరు, చిన్నముడియంతోపాటు వాటి పరిధిలోని భూములు తీసుకుని ఇప్పుడు విడతల వారీగా నష్టపరిహారం చెల్లిస్తే తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని రైతులు అంటున్నారు.
పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆలస్యం కాదని హామీ ఇస్తేనే తాము పత్రాలు ఇచ్చామని, పరిహారం చెల్లించకపోతే తమ పత్రాలు వెనక్కి ఇవ్వాలని భూములు ఇచ్చిన రైతులు డిమాండ్ చేశారు. దీంతో పరిహారం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ విజయరామరాజు హామీ ఇచ్చారు. అలాగే
సీఎం జగన్‌తో బాధిత రైతుల ప్రతినిధులతో మాట్లాడిస్తానని భరోసా ఇచ్చారు.
Updated Date - 2022-12-05T16:36:19+05:30 IST