కడప నుంచి దూరప్రాంతాలకు మరో నాలుగు బస్సులు ప్రారంభం
ABN, First Publish Date - 2022-11-29T00:14:58+05:30
కడప నుంచి దూరప్రాంతాలకు మరో నాలుగు నాన్ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఆ మేరకు సోమవారం స్థానిక కడప డిపో వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవానికి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి హాజరై తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కడప(మారుతీనగర్), నవంబర్ 28: కడప నుంచి దూరప్రాంతాలకు మరో నాలుగు నాన్ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఆ మేరకు సోమవారం స్థానిక కడప డిపో వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవానికి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి హాజరై తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి కొత్త బస్సులలోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ కడప డిపో నుంచి హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇవి ఈ నెల ఈనెల 30 వ తేదీనుంచి ప్రయాణీకుల సేవలోకి వస్తాయన్నారు. కడప డిపో నుంచి రాత్రి 10-30కు బయలుదేరి వెళతాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ గోపీనాథ్‌రెడ్డి, ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు బాబాఫకృద్దీన్, కేకే కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-11-29T00:14:59+05:30 IST