కడప పేరును కొనసాగించాలి : లింగారెడ్డి
ABN, First Publish Date - 2022-02-14T04:50:11+05:30
కడప జిల్లాకు పేరును కొనసాగించా లని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్ చేశారు.
వేంపల్లె, ఫిబ్రవరి 13: కడప జిల్లాకు పేరును కొనసాగించా లని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా పేరు లేకుండా తొలగించడం శోచనీయమన్నారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రైతులకు డ్రిప్‌లు, స్ర్పింక్లర్లు ఇవ్వాలన్నారు.
ఇసుక ఆదాయ మంతా వైఎస్ కుటుంబానికే చెందుతోందని, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నా రని ఆరోపించారు. వేముల మండలంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బలవంతంగా ఏర్పాటు చేసిన యురేనియం ప్రాజెక్టుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. టీడీపీ బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించి పార్లమెంటులో కూడా ప్రశ్నిస్తారని ఎమ్మె ల్సీ తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-02-14T04:50:11+05:30 IST