మదనపల్లెలో ర్యాలీ నిర్వహిస్తున్న అధ్యాపకులు, విద్యార్థినులు
ABN, First Publish Date - 2022-11-25T23:45:43+05:30
మహిళల ఉజ్వల భవిష్యత కోసం హింస, వేధింపులపై ఉద్యమించాలని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణవేణి పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, నవంబరు 25: మహిళల ఉజ్వల భవిష్యత కోసం హింస, వేధింపులపై ఉద్యమించాలని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణవేణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభు కళాశాలలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్ర మంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలపైన ఏదో ఒక రకంగా హింస, వేధింపులు జరుగుతున్నాయని మహిళను హింసిం చడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే అన్నారు. చట్టప్రకా రం ఇది ఎంత శిక్షార్హమో..అందరికి వివరించి, హింసను అరికట్టడంలో పాలుపంచుకుందామన్నారు. కాగా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు అందరూ నారింజ రంగు డ్రస్సుల్లో వచ్చి, పాటలు పాడి హింసకు తాము వ్యతిరేకమని ఎలుగెత్తారు. కార్యక్రమంలో ఎనఎస్‌ఎస్ కో ఆర్డినే టర్ మోహనవళ్లి, వనజ, విష్ణుప్రియ, నమ్రత, జ్యోతి, మోహనబాబు, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
కురబలకోటలో: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగా లని న్యాయవాది శైలజ, అథ్లెట్ మంజులారెడ్డిలు పేర్కొన్నారు. మండ లంలోని అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహి ళలపై జరుగుతున్న హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను నివారించడానికి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపా ల్ యువరాజ్, అథ్హర్ సమీనా, సాహిద్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె, అర్బన: అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని చైతన్య సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా శిశుసంక్షేమ శాఖ సీడిపీవో సుజాతతో కలిసి శుక్రవారం పురవీధులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడు తూ సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక సం ఘటనల పై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో టీచర్లు పుష్పలత, సుభాషిని, మమత, విద్చార్దునులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-25T23:45:45+05:30 IST