ఉపాధి కల్పించడమే లక్ష్యం
ABN, First Publish Date - 2022-10-26T22:58:31+05:30
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సిల్క్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలం కె.బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కశాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు.
రైల్వేకోడూరు, అక్టోబరు 26: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సిల్క్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలం కె.బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కశాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే, విప్ శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి, రైల్వేకోడూరు మండల పరిషత్ వైస్ చైర్మన్ రామిరెడ్డి ధ్వజారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు.
Updated Date - 2022-10-26T22:58:34+05:30 IST