బదిలీల జీఓను విడుదల చేయాలి: యూటీఎఫ్
ABN, First Publish Date - 2022-11-08T23:31:43+05:30
బదిలీల జీఓ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రఽధాన కార్యదర్శులు విజయకుమార్, మహే్షబాబు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.
కడప (ఎడ్యుకేషన), నవంబరు 8: బదిలీల జీఓ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రఽధాన కార్యదర్శులు విజయకుమార్, మహే్షబాబు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు బదిలీలపై రోజుకో ప్రకటన చేస్తూ ఉపాధ్యాయ లోకాన్ని అయోమయంలోకి నెట్టుతున్నారన్నారు. ఇం తకు బదిలీలు ఉన్నాయా, లేవా అన్నది స్పష్టమైన ప్రకటన ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయులందరూ ఆర్థిక, రాజకీయ పలుకుబడి కలిగిన ఉపాధ్యాయుల అక్రమ బదిలీల కోసమే ప్రభుత్వం బదిలీల జీఓ ఇవ్వకుండా ఆలస్యం చేస్తోం దని ఆరోపించారు. అక్రమ బదిలీలు జరిగితే ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున అడ్డుకుంటామన్నారు.
Updated Date - 2022-11-08T23:31:46+05:30 IST