ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN, First Publish Date - 2022-11-09T00:43:38+05:30

చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించటం అభినం దనీయమని ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఆలిండియా అసోసియేషన్‌ ఆఫ్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్స్‌, ఇంటర్‌ ప్రావిన్స్‌ చాంపియన్‌ క్విజ్‌ పోటీలు హైదరా బాద్‌ అబిడ్స్‌ లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్‌లో జరిగాయి. స్థానిక వీఎస్‌సెయింట్‌ జాన్స్‌ హైస్కూ ల్‌ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటగా విజేతల మంగళవారం అభినందన సభ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, నవంబరు 8 : చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించటం అభినం దనీయమని ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఆలిండియా అసోసియేషన్‌ ఆఫ్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్స్‌, ఇంటర్‌ ప్రావిన్స్‌ చాంపియన్‌ క్విజ్‌ పోటీలు హైదరా బాద్‌ అబిడ్స్‌ లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్‌లో జరిగాయి. స్థానిక వీఎస్‌సెయింట్‌ జాన్స్‌ హైస్కూ ల్‌ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటగా విజేతల మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ సంతోష్‌కుమార్‌ మాట్లాడు తూ అత్యంత ఉత్కంఠంగా కొనసాగిన పోటీల్లో చక్కటి ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. విజేతలకు రూ.10వేలు నగదు బహుమతి, రోలింగ్‌ ట్రోపీ, బంగారు పతకాన్ని అందుకున్నట్లు తెలిపారు. సీనియర్‌ బ్రదర్‌ జిమ్మి కురియాకోస్‌, సూర్యనారాయణ, బ్రదర్‌ భల్లా జోసఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

కరాటేలో గన్నవరం విద్యార్థుల ప్రతిభ

కరాటే పోటీలలో గన్నవరం విద్యార్థులు ప్రతిభ చూపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కోచ్‌ ఉప్పులూరి వెంకట్రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మంగళగిరిలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కృష్ణాజిల్లా నుండి అండర్‌ 12 విభాగంలో పాల్గొని ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మంగళవారం విజేతలైన అనిష్‌ వర్మ, శ్రీదేవి , మోహిత్‌, రోషన్‌, హర్షిత, చంద్రచోపు, మాన్య, రిత్విక్‌, మోహిని, దీక్షిత, దీపక్‌, గగన్‌ ఆర్‌య, అద్విత, అక్షయ, జోయర్‌లను వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మడుపల్లి బాలకృష్ణమూర్తి, కార్యదర్శి డాక్టర్‌ చిప్పాడ చంద్రశేఖర్‌రావు తదితరులు అభినందించారు. కరాటేలో మరింత రాణించాలని చెప్పారు.

Updated Date - 2022-11-09T00:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising