ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Road Accident.. బాపట్ల రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు: మంత్రి జోగి రమేష్

ABN, First Publish Date - 2022-12-05T12:28:05+05:30

బాపట్ల, వేమూరు మండలం జంపని దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)పై సీఎం జగన్ (CM Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బాపట్ల, వేమూరు మండలం జంపని దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)పై సీఎం జగన్ (CM Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనను వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించారన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని చెప్పారు. గాయపడిన వారికి రూ. 50 వేలు అందిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

బాపట్ల, వేమూరు మండలం జంపని దగ్గర సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టాటాఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 16 మంది గామపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేష్ (55), బోదిన రమేష్ (42), బుద్దన పవన్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా కృష్ణా జిల్లా నిలపూడి వాసులు.

Updated Date - 2022-12-05T12:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising