Ramakrishna: కైకాల మృతిపట్ల ప్రగాఢ సంతాపం
ABN, First Publish Date - 2022-12-23T11:00:39+05:30
ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
అమరావతి: ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యనారాయణ 777 పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో పలు విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు. పార్లమెంటు సభ్యులుగా రాజకీయ జీవితంలో సేవలందించారని తెలిపారు. నంది అవార్డుతో సహా పలు సినీ అవార్డులు ఆయనకు మణిహారంగా మారాయన్నారు. కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని రామకృష్ణ తెలిపారు.
Updated Date - 2022-12-23T11:00:40+05:30 IST