డంపింగ్ యార్డు తరలించాలి : సీపీఎం
ABN, First Publish Date - 2022-12-31T00:46:25+05:30
బందరు రోడ్డు పక్కన ఇళ్ల మధ్య దుర్గంధాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సీపీఎం నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, ఎస్కే ఖాసీం డిమాండ్ చేశారు. దగ్గర్లోని జనావాసాలను, బందరు రోడ్డు వెంబడి నిత్యం ప్రయాణించే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ డంపింగ్ యార్డును తరలించడంలో అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని డంపింగ్ యార్డు వద్ద నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
పెనమలూరు, డిసెంబరు 30 : బందరు రోడ్డు పక్కన ఇళ్ల మధ్య దుర్గంధాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సీపీఎం నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, ఎస్కే ఖాసీం డిమాండ్ చేశారు. దగ్గర్లోని జనావాసాలను, బందరు రోడ్డు వెంబడి నిత్యం ప్రయాణించే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ డంపింగ్ యార్డును తరలించడంలో అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని డంపింగ్ యార్డు వద్ద నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. గతంలో మునిసిపాలిటీ కాకముందు ఏ గ్రామానికి ఆ గ్రామ శివారుల్లో చెత్తను డంపింగ్ చేసేవారని, ఇప్పుడు నాలుగు గ్రామాల చెత్తను ఒక్క చోటే డంపింగ్ చేయటంతోనే ఈ సమస్య వస్తోందన్నారు. పలు వినతులతో కూడిన వినతిపత్రాన్ని మునిసిపల్ అధికారులకు అందించారు. నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్నవరపు శ్రీనివాసరావు, పుసులూరి సత్యనారాయణ, మరీదు భాస్కరరావు, వీ రఘు, గౌరీశంకర్, కొండవీటి శెట్టి, అమ్మిశెట్టి పద్మ, దుర్గారావు, వరలక్ష్మి, గౌరీ ఈశ్వరి, మల్లీశ్వరి, నలిని, స్థానికులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T00:46:27+05:30 IST