స్టెల్లాలో ఫెట్ డే వేడుకలు
ABN, First Publish Date - 2022-11-22T01:03:25+05:30
స్టెల్లా కళాశాలలో ఫెట్ డే వేడులను ప్రిన్సిపాల్ డాక్టర్ జసింతా క్వాడ్రెస్ సోమవారం ప్రారంభించారు.
పటమట,నవంబరు 21 : స్టెల్లా కళాశాలలో ఫెట్ డే వేడులను ప్రిన్సిపాల్ డాక్టర్ జసింతా క్వాడ్రెస్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థినులకు చదువుతో పాటు కేరింగ్, షేరింగ్, చారిటీ, ఆర్గనైజింగ్ స్కిల్స్‌పై అవగాహన క్రిస్‌మస్ ఫెట్ ద్వారా కల్పిస్తామని, విద్యార్థినులందరూ సంతోషంగా షోలు, స్టాల్స్ నిర్వహిస్తుంటారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థినులు మిస్ బ్లాక్, మిస్ బ్లూ షో నిర్వహించారు. మిస్ బ్లూగా అనుష్క, తర్వాత స్థానాల్లో డయానా, కీర్తి బహుమతులు దక్కించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ కె.అనూహ్య, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, కో-ఆర్డినేటర్లు గ్రేస్ యూనిస్, వున్నం స్వప్న పాల్గొన్నారు.
Updated Date - 2022-11-22T01:03:26+05:30 IST