విద్యకు ఐవీఎం చేయూత
ABN, First Publish Date - 2022-11-14T01:22:23+05:30
పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు లాప్‌టా్‌పలు, స్కాలర్‌షి్‌పల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఐవీఎం హోమ్‌లో జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్ మాట్లాడుతూ, ఎల్‌కేజీ నుంచీ పీజీ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు రూ.20లక్షల మేర సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
చల్లపల్లి: పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు లాప్‌టా్‌పలు, స్కాలర్‌షి్‌పల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఐవీఎం హోమ్‌లో జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్ మాట్లాడుతూ, ఎల్‌కేజీ నుంచీ పీజీ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు రూ.20లక్షల మేర సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 15 మందికి ఉన్నత విద్యకోసం రూ.నాలుగు లక్షల స్కాలర్‌షి్‌పలు, ఆరుగురికి మూడు లక్షల విలువ చేసే లాప్‌టా్‌పలను అందించినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే 120మందికి రూ.13 లక్షలు ఫీజులుగా చెల్లించామన్నారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, మాజీ సర్పంచ్ పరుచూరి వెంకటేశ్వరరావు, సజ్జా బలరాం, ట్రస్టీ వేములపల్లి రోజా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-14T01:22:26+05:30 IST