గుడివాడలో నవ్యసాయి పిల్లల ఆసుపత్రి ప్రారంభం
ABN, First Publish Date - 2022-12-18T00:20:16+05:30
చిన్నారులకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
గుడివాడ : చిన్నారులకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏలూరు రోడ్డులోని బొమ్మరిల్లు థియేటర్ పక్కన నవ్యసాయి పిల్లల ఆసుపత్రిని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, డాక్టర్ మన్నెం భవానీశంకర్, డాక్టర్ లింగం నాగేంద్ర ప్రసాద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. డాక్టర్ ఎం.శ్రీనాథ్‌రెడ్డి, గుత్తా శ్రీశ్రావ్యను అభినందించారు. వైసీపీ పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను, పాలేటి చంటి, ఎం.వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-12-18T00:20:18+05:30 IST