ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబజార్లో అక్రమాల పుట్ట

ABN, First Publish Date - 2022-12-04T00:57:24+05:30

స్థానిక కేదారేశ్వరపేటలోని రైతుబజార్‌ అంటేనే హాట్‌ టాఫిక్‌కు కేరాఫ్‌. గతంలో దాదాపు రూ.30లక్షల స్కామ్‌ బయటపడగా అదింకా కోర్టులో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం దాన్ని అధిగమించేలా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేదారేశ్వరపేట, డిసెంబరు 3 : స్థానిక కేదారేశ్వరపేటలోని రైతుబజార్‌ అంటేనే హాట్‌ టాఫిక్‌కు కేరాఫ్‌. గతంలో దాదాపు రూ.30లక్షల స్కామ్‌ బయటపడగా అదింకా కోర్టులో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం దాన్ని అధిగమించేలా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు. అవినీతి, అడ్డగోలు ముడుపుల్లో టీం వర్క్‌ నడుస్తుందని, అందుకే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరూ కలుగచేసుకోరని బహిరంగం గానే చెప్పుకుంటున్నారు. రైతుబజార్‌లో కనీసం వినియోగదారుడు నడిచేందుకు దారి కూడా లేకుండా అనధికారికంగా షాపులను కేటాయిస్తున్నారు. దీంతో అసలైన రైతులు, డ్వాక్రా, వికలాంగుల షాపుల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వినియోగుదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నడవడానికి దారిలేక, ఉక్కిరిబిక్కిరవుతూ ఎలాంటి రోగాలు వస్తాయోనని కంగారు పడుతున్నారు. చిన్నచోటున్నా షాపుపెట్టే పరిస్థితి చోటుచేసుకుంది.

ఆరుగురి కబంధ హస్తాల్లో విలవిల

రైతుబజారు ఓ ఆరుగురి కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దాదాపు వారికిందే 50 షాపుల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. బిజినెస్‌ జరిగే ప్రాంతాల్లోనే పర్మినెంట్‌గా షాపులున్నాయి. ఈవోను తమకు అనుకూలంగా మార్చుకుని తాము చేసేదే న్యాయం అన్నట్టుగా సాగుతోంది. వారి నిబంధనలు మాత్రమే రైతుబజార్‌లో అమలవుతున్నాయి. పేరుకే లాటరీ ద్వారా షాపుల కేటాయింపు. దీంతో సామాన్య రైతుల పరిస్థితి దారుణంగా మారింది.

అధిక రేట్లు... మోసపు తూకాలు

రైతుబజార్‌లో అడ్డగోలు వసూళ్ల కారణంగా బోర్డు రేటు కన్నా కూరగాయలను అధిక రేట్లకు అమ్ముతున్నారు. తూకాల్లోనూ మోసం చేస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. బోర్డు రేటుకన్నా రూ.2, 3కు పైనే అ మ్ముతున్నారు. వినియోగదారుడు కేజీ కూరగాయలు కొనుగోలు చేస్తే, దాదా పు 100 గ్రాములు పైనే తక్కువగా తూగుతున్నాయి. ఇదేంటని అడిగితే అ ధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.

రైతుబజార్‌ బయట.. నరకమే!

వినియోగదారుడు రైతుబజార్‌కు రావాలంటే అతడి ద్విచక్రవాహనాన్ని ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియని పరిస్థితి. వెలుపల అడ్డగోలుగా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలు ఎక్కడ పెట్టాలని అడిగితే గొడవలకు దిగుతున్నారు. మెయిన్‌రోడ్డు సగం వరకు ఆక్రమించడంతో వినియోగదారుడు వాహనాన్ని ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి. అధికారులకు, పోలీసులకు ఇది కానరాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇక్కడి ఈవో బదిలీ కాగానే వెంటనే ఆ ఆర్డర్‌ను నిలుపుదల చేసుకుని ఇక్కడే ఉండేలా ఆర్డర్‌ తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఆ ఆరుగురు ఆయన వెన్నంటి ఉండడంతో, ఓ స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి ఆర్డర్‌ను మార్చుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ ఉన్నతాధికారి ఈవోకు వెన్నుదన్నుగా ఉండటంతో ఆయన ఇక్కడే తిష్టవేసుకుని కూర్చుకున్నారు.

Updated Date - 2022-12-04T00:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising