Leopard Attack Dog: హడలిపోతున్న చింతకుంట జనం
ABN, First Publish Date - 2022-10-02T23:40:05+05:30
కోసిగి మండలం చింతకుంట ప్రజలను చిరుత పులి (Leaopard) హడలెత్తిస్తోంది. గ్రామ సమీపంలోని అడవుల్లో...
కర్నూలు (Kurnool): కోసిగి మండలం చింతకుంట ప్రజలను చిరుత పులి (Leaopard) హడలెత్తిస్తోంది. గ్రామ సమీపంలోని అడవుల్లో నుంచి తరచూ వస్తూ పశువులపై దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. తమ పొలాల్లోనూ సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని జంకిపోతున్నారు.
తాజాగా చింతకుంట (Chinthakunta) గ్రామ (Village) సమీపంలో చిరుత పులి కనిపించింది. గ్రామానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్న రైతు భద్రీ నరసింహులు పొలంలో చిరుత పులి సంచరించింది. నీరు పెట్టేందుకు తాను పొలానికి వెళ్లే సమయంలో కుక్క(Dog)ను చిరుత పులి లాక్కెళ్లిందని రైతు నరసింహులు తెలిపారు. పులికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి. దీంతో చిరుత అడుగులు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కోసిగి కొండల్లో చిరుత పులులు తరచూ కనిపిస్తున్నాయని అధికారులు స్పందించి చిరుత నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
విషయం తెలుసుకు ఫారెస్ట్ అధికారులు (Forest Officers).. చిరుత పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటిదాకా స్థానిక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని సూచించారు. అలాగే పశువుల (Cattles)ను కూడా జాగ్రత్త చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Updated Date - 2022-10-02T23:40:05+05:30 IST