ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మార్చి వరకు హంద్రీ నీవా నీరు వదలాలి’

ABN, First Publish Date - 2022-12-15T01:04:36+05:30

రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా నీరు వచ్చే ఏడాది మార్చి వరకు వదలాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌, కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ హంద్రీనీవా కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈని కలిసి బుధవారం వినతి పత్రం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (అగ్రి కల్చర్‌), డిసెంబరు 14: రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా నీరు వచ్చే ఏడాది మార్చి వరకు వదలాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌, కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ హంద్రీనీవా కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈని కలిసి బుధవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ కింద జిల్లాలో కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, దేవనకొండ మండలాల్లో రైతులు 40వేల ఎకరాల్లో ప్రస్తుత రబీలో పంటలు సాగు చేశారని, కేవలం విద్యుత్‌ చార్జీలను చెల్లించలేక తెలంగాణ రాష్ట్రం పైసాకు పెట్టి శ్రీశైలం జలాశయం నీటిని హంద్రీనీవా కాలువకు ఈ నెలాఖరు వరకే ఇస్తామని చెప్పడం దారుణ మన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో అధిక వర్షాలు రావడం వల్ల తెగుళ్లు సోకి మరోవైపు నకిలీ పత్తి విత్తనాల వల్ల పంట దిగుబడులు పూర్తిగా తగ్గాయని, కనీసం రబీలోనైనా పంటలు సాగు చేసి నష్టాన్ని పూడుస్తామని ఆశ పడితే ప్రభుత్వం హంద్రీనీవా కాలువకు ఈ నెలా ఖరు వరకే నీళ్లను ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వక పోతే రైతులను సమీకరించి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-15T01:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising