ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములివ్వం

ABN, First Publish Date - 2022-12-07T23:22:36+05:30

బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామ సమీపంలోని జయజ్యోతి సిమెంట్‌ ఫ్యాక్టరీ అవసరాల నిమిత్తం నిర్మించనున్న రైల్వే లైన్‌కు తాము భూములు ఇవ్వబోమని రెవెన్యూ అధికారులకు రైతులు తేల్చి చెప్పేశారు.

రైతులతో మాట్లాడుతున్న డోన్‌ ఆర్డీవో వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే లైన్‌ పనులను అడ్డుకున్న రైతులు

స్టే ఇచ్చిన కోర్టు

బనగానపల్లె , డిసెంబరు 7: బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామ సమీపంలోని జయజ్యోతి సిమెంట్‌ ఫ్యాక్టరీ అవసరాల నిమిత్తం నిర్మించనున్న రైల్వే లైన్‌కు తాము భూములు ఇవ్వబోమని రెవెన్యూ అధికారులకు రైతులు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు బుధవారం సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. డోన్‌ఆర్డీవో వెంకటరెడ్డి, తహసీల్దారు రామకృష్ణ, ఇతర సర్వేయర్లతో కలిసి పొలాలను కొలతలు వేయడానికి రాగా యనకండ్ల రైతులు అడ్డుకున్నారు. బనగానపల్లె మండలంలోని యనకండ్ల సమీపంలో నిర్మించిన జయజ్యోతి సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన సిమెంట్‌ను యనకండ్ల ఫ్యాక్టరీ నుంచి బనగానపల్లె రైల్వే స్టేషన్‌కు మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. దీని కోసం ఫ్యాక్టరీ నుంచి బనగానపల్లె రైల్వే స్టేషన్‌ వరకు ప్రత్యేక లైన్‌ నిర్మించాలని ఫ్యాక్టరీ అనుకుంది. ఇందులోభాగంగా డోన్‌ ఆర్డీవో వెంకటరెడ్డి, బనగానపల్లె తహసీల్దారు రామకృష్ణ, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు రామిరెడ్డి, శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో సర్వే చేయడానికి సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు వచ్చారు. యనకండ్లకు చెందిన రైతులు నొస్సం సాంబశివారెడ్డి, రామసుబ్బయ్య, సుబ్బరాయుడు, మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాగేంద్ర, వెంకటసుబ్బయ్య, గౌరు లక్ష్మన్న, పెద్ద కుళాయి, చిన్నబాబు, పెద్దబాబు, నడిపి సుంకన్న తదితరులు తాము పొలాల్లో పైర్లు వేశామని, పంట ఉంటే ఎలా కొలుస్తారని ప్రశ్నించారు. మొత్తం 36 మంది రైతుల పొలాలను సర్వే చేయడానికి అధికారులు భారీ బందోబస్తుతో వచ్చారు. 10 మంది రైతులు తమ పొలాలను సర్వే చేయడానికి వీల్లేదని, తాము కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేను ఆర్డీవోకు చూపించారు. మిగతా రైతులు కూడా తాము పొలాలు ఇవ్వబోమని అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం వెనుదిరిగి వెళ్లి పోయింది. ఈ సందర్భంగా డోన్‌ ఆర్డీవో వెంకటరెడ్డి మాట్లాడుతూ రైల్వే లైన్‌ నిర్మాణంలో రైతుల పొలం ఎంతపోతుందో సర్వే చేయడానికి మాత్రమే తాము వచ్చామని తెలిపారు. అయితే రైతులు స్టే ఆర్డర్‌ తీసుకు రావడంతో ప్రస్తుతానికి కొలతలు వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు కిశోర్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఐ ప్రవీణ్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

మా పొలాలు ఇవ్వం

జయజ్యోతి ఫ్యాక్టరీ రైల్వే లైన్‌కు పొలాలు ఇవ్వం. దౌర్జన్యంగా సర్వే చేయడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం యత్నిస్తోంది. మా జీవనాధారమైన పొలాన్ని ఫ్యాక్టరీకి ఇచ్చే ప్రసక్తే లేదు. పైగా ఈ ప్యాక్టరీ వల్ల మా గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేదు.

-వెంకటేశ్వరరెడ్డి, యనకండ్ల రైతు

దౌర్జన్యంగా సర్వే చేస్తారా?

మాకు ఉండేది రెండు ఎకరాలు. ఈ పొలంతోనే మేం జీవిస్తున్నాం. రైల్వే లైన్‌కు ఈ పొలం పోతే ఇంక మాకు బతుకుదెరువు లేనట్లే. దౌర్జన్యంగా సర్వే చేస్తారా? అంగీకరించం.

-సుభద్ర, మహిళా రైతు

Updated Date - 2022-12-07T23:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising