ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోచుకోవడమే వైసీపీ నైజం: గౌరు

ABN, First Publish Date - 2022-12-12T00:04:02+05:30

రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని దోచుకోవడమే వైసీపీ నైజమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

గౌరు వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన బీజేపీ డోన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు/డోన, డిసెంబరు 11: రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని దోచుకోవడమే వైసీపీ నైజమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. డోన పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు కృష్ణప్రసాద్‌తో పాటు మరో 50 కుటుంబాలు ఆదివారం కర్నూలులో గౌరు వెంకటరెడ్డి సమక్షంలో సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఆత్మకూరు ఇనచార్జి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన పాలనతో రాష్ట్రాభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని, వారి ఆటలు ఎంతోకాలం సాగవని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో బీజేపీ నాయకులు ఆకర్షితులై టీడీపీలో చేరారన్నారు. టీడీపీ డోన పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, జలదుర్గం విష్ణు, సుంకయ్య, మర్రి ఉపేంద్ర, కుమ్మరి సుధాకర్‌, ధను పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising