రావణ వాహనంపై సిద్ధిధాత్రి దుర్గ
ABN, First Publish Date - 2022-10-05T05:57:37+05:30
మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు కామేశ్వరీదేవి సిద్ధిధాత్రి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు.
మహానంది, అక్టోబరు 4: మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు కామేశ్వరీదేవి సిద్ధిధాత్రి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేదపండితుడు నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాలలో దాతల చేత హోమాలు, చండీయాగాలు చేయించారు. సాయంత్రం ఆలయం ప్రాంగణంలోని అలంకార మంటపంలో మహిళలు సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. రాత్రి కామేశ్వరీదేవిని సిద్ధిధాత్రి దర్గగా అలంకరించి రావణ వాహనంపై పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈవో ఎర్రమల్ల మధు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-05T05:57:37+05:30 IST