ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

ABN, First Publish Date - 2022-12-08T00:11:20+05:30

శ్రీశైల క్షేత్రంలో మార్గశిర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం వైభవంగా నిర్వహించింది.

గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్న అర్చకులు, ఆలయ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, డిసెంబరు 7: శ్రీశైల క్షేత్రంలో మార్గశిర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం వైభవంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుతో గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జున సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అక్కడి నుంచి వలయదారి మీదుగా గణేష సదనం, సారంగఽధర మండపం, గోశాల, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది.

భ్రమరాంబ దేవికి లక్ష కుంకుమార్చన

శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం మార్గశిర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు వారి గోత్రనామాలతో లక్షకుంకుమార్చనలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్ష సేవ ద్వారా అవకాశం కల్పించింది. కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు పూజా సంకల్పం పఠించి అనంతరం మహాగణపతికి పూజలు చేశారు. తరువాత లక్షకుంకుమార్చనను జరిపించారు. శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలలో పాల్గోనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.1,116 లు సేవారుసుమును చెల్లించి పరోక్షసేవలో పాల్గొనవచ్చును. భక్తులు ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న సూచించారు.

Updated Date - 2022-12-08T00:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising