ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains: 5న అల్పపీడనం...7న వాయుగుండం.. ఏపీ వర్షాలు

ABN, First Publish Date - 2022-12-01T19:51:14+05:30

పసిఫిక్‌ మహా సముద్రం (The Pacific Ocean), దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్‌ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పసిఫిక్‌ మహా సముద్రం (The Pacific Ocean), దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్‌ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు తుఫాన్‌ల అవశేషాలు అండమాన్‌లోకి రాగా...తాజాగా మరొకటి రానున్నది. థాయ్‌ల్యాండ్‌లో తీరం దాటి బలహీనపడిన తుఫాన్‌ నుంచి అవశేషంగా మిగిలిన ఉపరితల ఆవర్తనం ఈ నెల నాలుగో తేదీన దక్షిణ అండమాన్‌లో ప్రవేశించనున్నది. దీని ప్రభావంతో ఈనెల ఐదో తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడుతుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల ఏడో తేదీకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నది. అనంతరం ఈనెల ఎనిమిదో తేదీకల్లా తమిళనాడు, పుదుచ్చేరి తీరం దిశగా రానున్నది. దీని ప్రభావంతో ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తాయన్న నిపుణుల హెచ్చరికతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కోస్తాలో గుంటూరు జిల్లా (Guntur District) నుంచి శ్రీకాకుళం వరకు వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో వర్షాల గురించిన సమాచారం కోసం రైతులు విశాఖలోని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేస్తున్నారు. ఈనెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడిన తరువాత వర్షాలపై స్పష్టత వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. కాగా తూర్పుగాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో చలి తీవ్రత

రాష్ట్రంలో డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా వుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు నెలల కాలానికి భారత వాతావరణ శాఖ గురువారం బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం దక్షిణ భారతం (South India) దానికి ఆనుకుని మధ్య భారతంతోపాటు వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర (Telangana, Maharashtra), ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు జార్ఖండ్‌, రాజస్థాన్‌లలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ నమోదవుతాయని వివరించింది. పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ, మధ్య భారతంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం వుంటుందని నిపుణులు వివరించారు. అందువల్ల ఈ ఏడాది శీతాకాలంలో చలి ప్రభావం వుంటుందని తెలిపారు.

Updated Date - 2022-12-01T19:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising