Ap High Court: మహాసేన రాజేష్‌కు ఊరట
ABN, First Publish Date - 2022-07-26T23:50:43+05:30
మహాసేన రాజేష్ (Mahasena Rajesh)పై రౌడీషీట్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2021లో పెద్దాపురం (Peddapuram) పోలీస్ స్టేషన్లో ..
అమరావతి (Amaravathi): మహాసేన రాజేష్ (Mahasena Rajesh)పై రౌడీషీట్ ఏపీ హైకోర్టు (Ap High Court) కొట్టివేసింది. 2021లో పెద్దాపురం (Peddapuram) పోలీస్ స్టేషన్లో మహాసేన రాజేష్పై రౌడీషీట్ నమోదు చేశారు. దాంతో కేసును మహాసేన రాజేష్ సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన కోర్టు రౌడీ షీట్ (rowdy sheet) కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే రాజేష్ తరపున కోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Jada Sravan Kumar) వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే రౌడీషీట్ ఓపెన్ చేశారని కోర్టులో వాదనలు వినిపించారు. ఏ కేసులో కూడా రాజేష్కు కోర్టు శిక్ష విధించలేదని తెలిపారు. అక్రమ కేసులతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారన్నారు. జడ శ్రావణ్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. మహాసేన రాజేష్పై పెట్టిన రౌడీషీట్‌ను కొట్టివేసింది.
కాగా మహాసేన పేరుతో రాజేష్.. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహాసేన టీమ్ సభ్యుడు ఒకరు పెట్టిన పోస్టుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాజేష్‌తో పాటు మహాసేన టీమ్ సభ్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు మహాసేన రాజేష్పై ఏకంగా రౌడీ షీడ్ నమోదు చేశారు. దీంతో మహాసేన రాజేష్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో రాజేష్‌కు ఊరట లభించింది.
Updated Date - 2022-07-26T23:50:43+05:30 IST