విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉంది : మంత్రి విశ్వరూప్
ABN, First Publish Date - 2022-05-25T20:01:44+05:30
అమలాపురంలో ఆందోళనలు అత్యంత దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉందన్నారు.
అమలాపురం : అమలాపురంలో ఆందోళనలు అత్యంత దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉందన్నారు. అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చారని.. విధ్వంసం సృష్టించారన్నారు. చట్టానికి అందరూ సమానమేనన్నారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదన్నారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కావాలనే కొందరు ఆందోళనలను డైవర్ట్ చేశారని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.
Updated Date - 2022-05-25T20:01:44+05:30 IST