జోగి రమేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరోక్ష వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-11-22T20:49:37+05:30
మంత్రి జోగి రమేష్‌పై (Jogi Ramesh) వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (MLA Vasantha Krishna Prasad)పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: మంత్రి జోగి రమేష్‌పై (Jogi Ramesh) వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (MLA Vasantha Krishna Prasad)పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కొంత చికాకు ఉన్న మాట వాస్తవమేనని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. కొందరు కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గం పని కట్టుకొని విభేదాలు సృష్టిస్తోందన్నారు. తాను మీడియా సమావేశం పెడుతున్నానని తెలిసి.. పని గట్టుకుని తనపై కొందరు విమర్శలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో అధిష్టానాన్ని కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరిస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు విషయంలో తన తండ్రి నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆయన వ్యాఖ్యలతో తనకు, పార్టీకి సంబంధం లేదన్నారు.
Updated Date - 2022-11-22T20:49:41+05:30 IST