ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు పథకాలు అందేలా కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-11-22T22:28:49+05:30

కావలి, నవంబరు22: దళితులకు అందాల్సిన పథకాలు అందేలా అధికారులు కృషిచేయాలని ఎస్సీ కమిషన్‌ సభ్యులు కే. బసవరావు తెలిపారు.

వివిధశాఖల అధికారులతో మాట్లాడుతున్న ఎస్సీ కమిషన్‌ సభ్యులు బసవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, నవంబరు22: దళితులకు అందాల్సిన పథకాలు అందేలా అధికారులు కృషిచేయాలని ఎస్సీ కమిషన్‌ సభ్యులు కే. బసవరావు తెలిపారు. మంగళవారం ఆయన పోలీసు అతిథిగృహంలో వివిధశాఖల అధికారులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ పథకాలను ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దళితులు సద్వినియోగం చేసుకుని, తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలన్నారు. తొలుత ఆర్డీవో శీనానాయక్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందచేశారు. పోలీస్‌, రెవెన్యూ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు, దళితసంఘాల నేతలు ఆయన్ను కలవగా వారితో కొంతసేపు మాట్లాడారు.

చినవెంకయ్యకు హక్కులు కల్పించండి

కొండాపురం, నవంబరు22: మండలంలోని మర్రిగుంటలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యులు కే.బసవరావు మంగళవారం పర్యటించారు. గ్రామానికి చెందిన ఇండ్ల చినవెంకయ్య తనకు గతంలో ప్రభుత్వం సర్వే నెంబరు 219లో రెండు ఎకరాలు పట్టా ఇవ్వగా, అప్పటి నుంచి సాగుచేసుకుంటున్నాని, ఇటీవల ఆభూమిలో అధికారులు డంపింగ్‌యార్డు నిర్మాణానికి చర్యలు చేపట్టగా ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆయన గ్రామానికి వచ్చారు. చినవెంకయ్య సాగుచేసుకుంటున్న భూమికి సబ్‌ డివిజన్‌చేసి హక్కులు కల్పించాలని బసవరాజు అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఎంపీడీవో ఎమ్‌ బ్రహ్మయ్య, కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై ఖాజావళి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

------------

Updated Date - 2022-11-22T22:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising