నేటి నుంచి సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-04-05T05:20:07+05:30

సంగం పెన్నానది ఒడ్డున ఉన్న సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన సంగమేశ్వరాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, ఏప్రిల్‌ 4:  సంగం పెన్నానది ఒడ్డున ఉన్న  సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 15 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి ప్రతి నిత్యం రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం ఉదయం అంకురారోహణ, రాత్రి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 6 రాత్రి శేషవాహన గ్రామోత్సవం, 7న అశ్వవాహనం, 8న సింహవాహనం, 9న వీరభద్రస్వామి హోమం, 10న రావణసేవ, 11న నందిసేవ, 12న ఉదయం రథోత్సవం, రాత్రికి పురషామృగ మహోత్సవం, 13న గిన్నెభిక్ష, రాత్రికి కల్యాణం, 14న మేష సంక్రమణ, పుణ్యకాల తీర్థవాది, అలకలతోపు, ధ్వజారోహణము, 15న గంధవడి ఉత్సవం, రాత్రికి ఏకాంతసేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి రోజూ సాయంత్ర స్వామి, అమ్మవారికి పూలంగిసేవలు, గ్రామోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని  ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమూర్తి, ఆలయ ఈవో ప్రసాద్‌ తెలిపారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2022-04-05T05:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising