జామాయిల్ కర్ర స్వాధీనం
ABN, First Publish Date - 2022-06-15T04:46:11+05:30
మండలంలోని కసుమూరు - ఇస్లాంపేట గ్రామాల మధ్య అడవి నుంచి సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న జామాయిల్ కర్రలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
వెంకటాచలం, జూన్ 14 : మండలంలోని కసుమూరు - ఇస్లాంపేట గ్రామాల మధ్య అడవి నుంచి సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న జామాయిల్ కర్రలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ రేంజర్, సెక్షన్ అధికారులు ఈ దాడులు చేశారు. జామాయిల్ కర్రలను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి నెల్లూరులోని తమ కార్యాలయానికి తరలించారు. ఇంకా అడవిలో భారీ స్థాయిలో కర్రను కొట్టి ఉన్నారనీ, అటవీ అధికారులు దాడులు చేయకపోయి ఉంటే ఆ కర్రను కూడా రాత్రికి రాత్రే అమ్మకానికి తరలించే వారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారమైతే పట్టపగలే యథేచ్ఛగా ట్రాక్టర్లలో కర్రను తరలిస్తున్నా కొందరు స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలిసీ తెలియనట్టుగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.
Updated Date - 2022-06-15T04:46:11+05:30 IST