ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్‌లైటింగ్‌ పేరుతో స్వార్థ రాజకీయాలు

ABN, First Publish Date - 2022-11-29T22:19:26+05:30

అధికారపార్టీలో కొంతమంది నాయకులు సెంట్రల్‌లైటింగ్‌ పేరుతో చెన్నూరురోడ్డు విస్తరణలో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు.

తహసీల్దారు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డ్డిపాళెం, నవంబరు 29: అధికారపార్టీలో కొంతమంది నాయకులు సెంట్రల్‌లైటింగ్‌ పేరుతో చెన్నూరురోడ్డు విస్తరణలో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. చెన్నూరురోడ్డు విస్తరణలో భవన యజమానులపైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ మంగళవారం ప్రతిపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారన్నారు. మూడు అడుగుల మేర నిర్మించాల్సిన డ్రైనేజీలను రెండు అడుగులకు పరిమితం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. పలుకుబడిగల వారి ఇళ్ల వద్ద మలుపులు తిప్పారన్నారు. ఽసామాన్యుల కో న్యాయం, ధనికులకో న్యాయంగా ఉందన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. అనంతరం పలువురు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, సీపీఎం నాయకులు, పలువురు భవన యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T22:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising